ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం పర్యటనలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వీరు విశాఖ ప్రజలకిచ్చిన ప్రధాన వాగ్దానాలపై ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీలు నేడు జీవిఎంసి గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించాయి. కార్యక్రమాన్నుద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గు నాయుడు ,సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె రెహమాన్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ విశాఖ విజయనగరం ఏరియా కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు, సిపిఐ ఎంఎల్ ప్రజాపోరు జిల్లా కార్యదర్శి కే దేవసహాయం లు మాట్లాడారు.