మెట్పల్లి: ఇసుక రీచ్ రద్దు చేయాలని వినతి మెట్పల్లి మండలం ఆత్మకూర్లో ఏర్పాటు చేసిన ఇసుక రీచును రద్దు చేయించాలని కోరుతూ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగరావుకు గ్రామస్థులు బుధవారం వినతిపత్రం సమర్పించారు. ఇసుక రీచ్లో గ్రామంలో తాగు, సాగునీటికి ఇబ్బందులు తలెత్తుతాయని, అందుకు రీచ్ను రద్దు చేయాలని కోరారు. VDC ఛైర్మన్ రమేష్, నాయకులు ప్రదీప్ రెడ్డి, దిలీప్, శ్రీధర్, రాజశేఖర్, సత్యనారాయణ, ధర్మేందర్, లక్ష్మణ్ తదితరులున్నారు.