ఆసిఫాబాద్ జిల్లాలో రెండు రోజుల పాటు వైన్స్ షాపులు బంద్ నిర్వహించనున్నట్లు ఆసిఫాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ జ్యోతి కిరణ్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ..గణేష్ నిమజ్జనం నేపథ్యంలో శుక్ర. శనివారం రెండు రోజులు జిల్లా వ్యాప్తంగా ఉన్న 32 వైన్స్ షాపులు. మూడు బార్లు బంద్ నిర్వహించనున్నట్లు చెప్పారు. బంద్ నేపథ్యంలో ఎవరైనా అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.