కాలేశ్వరం ప్రాజెక్టు విచారణ సిబిఐకి అప్పగించడంపై మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ స్పందించారు. విచారణ నివేదిక తప్పులతరకగా ఉందని, అది నిలబడదని ప్రభుత్వానికి అర్థమైంది. అందుకే దాన్ని రద్దు చేసుకోవడానికి ఈ పని చేశారు అని ఆయన విమర్శించారు. సిబిఐ ఈ ప్రాజెక్టు పై సంపూర్ణ విచారణ జరిపి, జరిగిన అక్రమాలన్నింటిని బయటపెడుతుందని తనకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు.