వాతావరణ పరిస్థితుల ప్రభావంతో పెదపూడి మండలం తో సహా కాకినాడ జిల్లాలోని పలు ప్రాంతాలలో పంట పొలాలకు తెగుళ్లు బెడద అధికమైందని రైతన్న వాపోతున్నారు. తరచూ వర్షాలు పడటం వాతావరణ మబ్బుగా ఉండడంతో వరి పంటకు తెగులు అతిశంగా వస్తున్నాయన్నారు. పొలాల్లో తెగుళ్లు నివారణకు ప్రభుత్వం రాయితీపై మందులను అందించాలని కోరుతున్నారు.