Udayagiri, Sri Potti Sriramulu Nellore | Sep 12, 2025
దుత్తలూరు మండలం,భైరవరంలో సీజనల్ వ్యాధుల పట్ల వైద్యాధికారి ఆయుబ్ అప్సర్ ప్రజలకు అవగాహన కల్పించారు. శుక్రవారం గ్రామంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రానున్న వర్షాకాలం నేపథ్యంలో ప్రతి ఒక్కరూ దోమలు వృద్ధి చెందకుండా అనవసరపు నీరు నిలువలు లేకుండా చూసుకోవాలని సూచించారు. కాచి చల్లార్చిన నీరు మాత్రమే తీసుకోవాలని కోరారు.