గంట్యాడ మండలంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఏడాది 20 కోట్ల రూపాయలు శ్రీనిధి రుణాలు మంజూరు చేయాలనేది లక్ష్యమని, బుధవారం మధ్యాహ్నం గంట్యాడలో వెలుగు ఎపిఎం కే సులోచన దేవి తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు వారి పిల్లల చదువులు వ్యవసాయం తదితర అవసరాల కోసం లక్ష రూపాయల వరకు శ్రీనిధి రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. శ్రీనిధి రుణాల రికవరీ శత శాతంగా ఉందని ఈ సందర్భంగా వెలుగు ఏపిఎం సులోచన దేవి పేర్కొన్నారు.