షాద్‌నగర్ ICTCలో రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ అధికారులు ఇండెక్స్ టెస్టింగ్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా తనిఖీలు చేపట్టి, అందించే వైద్యాన్ని పరిశీలించినట్లు పేర్కొన్నారు. అనుమానిత వ్యక్తులపై టెస్టింగ్ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ శ్రీకర్ పేర్కొన్నారు.