నర్సాపూర్ (జి) మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకులో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నకిలీ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నాడు. సాధారణ తనిఖీల్లో భాగంగా శుక్రవారం బ్యాంకుకు వచ్చిన ఆడిట్ సిబ్బంది గోల్డ్ లోన్ల వివరాలను పరిశీలించారు. ఈ క్రమంలో కొన్ని ఖాతాల్లో తాకట్టు పెట్టిన బంగారం నకిలీదని గుర్తించారు. ఈ ఘటనతో బ్యాంక్ అధికారులు ఉలిక్కిపడ్డారు.