సంగారెడ్డిలోని అంబెడ్కర్ మైదానం అభివృద్ధికి రూ.32 కోట్ల ప్రతిపాదనలు పంపినట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఖాసీం భేగ్ అన్నారు. సంగారెడ్డిలో శుక్రవారం అయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో క్రీడల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తున్నట్లు చెప్పారు. సంగారెడ్డి జిల్లా విద్యార్థులు రాష్ట్ర, జాతీయస్థాయిలో ఆడినట్లు పేర్కొన్నారు.