ఎగువ నుంచి వస్తున్న వరదల కారణంగా పల్నాడు జిల్లా మాచర్ల మండలం నాగార్జునసాగర్ ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తి ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో దిగుకు నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. పది రోజులుగా సాగర్ గేట్లు నుంచి నీటిని కిందకు వదులుతున్నారు. అలాగే ఎడమ కాలువ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి విద్యుత్తు ఉత్పత్తి జరుగుతుంది భారీ వర్షాలు వరదల కారణంగా జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. దీంతోపాటు కూడా సాగర్ జలాలతో నింపారు.