Araku Valley, Alluri Sitharama Raju | Aug 27, 2025
అరకులోయ మండలంలోని చొంపికి వెళ్లే దారిలో వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నందున తాత్కాలిక దారి మూసి వేసినట్లు వంతెన నిర్మాణ అధికారులు తెలియజేశారు. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం వరకు కురుస్తున్న భారీ వర్షాలకు కొండ వాగు పొంగి ఉద్ధృతంగా వరద నీరు ప్రవహిస్తుందన్నారు. దీంతో ఈ దారిలో రాకపోకలు నిలిపివేసినట్లు యంత్రాంగం తెలిపింది. వాహనదారులు, ప్రజలు సహకరించాలని కోరారు.