జీడి నెల్లూరు నియోజకవర్గం, వెదురుకుప్పం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపాలంటూ పలువురు కూటమి నాయకులు మంగళవారం తుడా ఛైర్మన్, టీటీడీ బోర్డు సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. తిరుపతి జిల్లాకు 15 కిలో మీటర్లు సమీపంలో ఉన్న వెదురుకుప్పం మండలాన్ని తిరుపతిలో కలిపే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించాలని వారు దివాకర్ రెడ్డిని కోరారు. ప్రజల వినతిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని దివాకర్ రెడ్డి హామీ ఇచ్చారని కూటమి నాయకులు తెలిపారు.