అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వినాయక చవితిని పురస్కరించుకుని భారీ వినాయక ప్రతిమలు వాడవాడలా వెలిశాయి.వినాయక మండపాల వద్ద విద్యుత్ దీపాలంకరణలతో అలంకరించి దేదీప్యమానంగా మండపాలను సిద్ధం చేశారు. మండపాలలో భక్తిశ్రద్ధలతో భారీ వినాయక ప్రతిమలు ప్రతిష్టించి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఇంటిలోన చిన్న చిన్న మట్టి ప్రతిమలు ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలను చేపట్టారు. స్వామి వారికి ఇష్టమైన ఉండ్రాళ్ళు, వెలక్కాయలు,చెరుకుగెడలు, మరియు పండ్లు స్వామి వారి ముందు ఉంచి పూజలు నిర్వహించారు.