నూతన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీమంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ కరీంనగర్ నియోజకవర్గం పరిధిలోని కొత్తపల్లి మండలం ఖాజీపూర్ గ్రామంలో MGNR EGS నిధులు సుమారు 20 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని శుక్రవారం మధ్యాహ్నం 2గంటలకు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కొత్తపల్లి మండల మాజీ ఎంపీపీ పిల్లి శ్రీలత- మహేష్ లతో కలిసి.. గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే గంగులకు BRS పార్టీ మండల అధ్యక్షులు కాసరపు శ్రీనివాస్ గౌడ్, మరియు BRS పార్టీ ప్రజాప్రతినిధుల తో పాటు అధికారులు ఘన స్వాగతం పలికారు.