ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని ఎన్ఏపి కాలువ సమీపంలో పోలాలలో కరెంటు స్తంభం కూలెందుకు సిద్ధంగా ఉంది. దీంతో ఆ ప్రాంతంలోని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్తంభం వాలిపోవడమే కాకుండా కరెంటు తీగలు ఎప్పుడు తెగుతాయని రైతులు భయపడుతున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఉండగా కరెంటు షాక్ కు గురై ఇద్దరు మృతి చెందిన సంఘటన గుర్తు చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.