రాజీయే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీమతి జి. నీలిమ గారు అన్నారు. శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలోని అన్ని కోర్టులలో మరియు నర్సాపూర్, అల్లదుర్గ్ కోర్టులలో జాతీయలోక్ అదాలత్ నిర్వహించారు. మొత్తంఏడు బెంచ్లు నిర్వహించడంజరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీమతి జి. నీలిమ గారు మాట్లాడుతూరాజీ పడడంతో ఇరువురికి న్యాయం జరుగుతుందన్నారు.జాతీయ లోక్ అదాలత్లో జిల్లా వ్యాప్తంగా 4,987 అన్ని రకాల కేసులు పరిష్కరించి10488964రూపాయలరికవరీ చేసినట్లు తెలిపారు