పాణ్యం మండలంలో వెలుగు ఆఫీస్ నందు మండల సమాఖ్య అకౌంటెంట్లకు శిక్షణ తరగతులను నిర్వహించారు. డిఆర్డిఏ పథక సంచాలకుడు వై.బి. శ్రీధర్ రెడ్డి హాజరై సిబ్బందికి ఈ శిక్షణ ఇచ్చారు. అకౌంటెంట్లు తప్పకుండా అన్ని రకాల పుస్తకాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. అకౌంట్లో సంబంధించిన రికార్డులన్నీ సక్రమంగా ఉండేలా చూసుకోవాలన్నారు. డి.పి.ఎం ఐ.బి.నాయక్, కోఆర్డినేటర్ ప్రసాద్, ఏపీఎం పుణ్యవతి పాల్గొన్నారు.