శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని బెస్ట్ యూనివర్సిటీ లో జాతీయ వ్యవసాయ సదస్సులు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పద్మశ్రీ అవార్డు గ్రహీత తెలంగాణకు చెందిన మల్లేశం, కర్ణాటక ప్రభుత్వ అగ్రికల్చర్ ఓఎస్డి డాక్టర్.ఏబి.పాటిల్, బెస్ట్ యూనివర్సిటీ చైర్మన్ భరత్ లాల్ మీనా, వైస్ ఛాన్స్లర్ డాక్టర్.దివ్య, నార్మ్ డైరెక్టర్ డాక్టర్.గోపాల్ లాల్, తదితర ప్రముఖులు హాజరయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు క్యాంపస్ ఆవరణలో వివిధ వ్యవసాయ ఉత్పత్తుల స్టాళ్లను ఏర్పాటు చేయగా, ముఖ్య అతిథులు వాటిని తిలకించి విశ్వవిద్యాలయ ప్రాముఖ్యతను అడిగి తెలుసుకున్నారు.