ములుగు జిల్లాలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పరిస్థితి ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా మారింది. పార్టీలో నాయకుల వ్యవహార శైలి పట్ల జిల్లా ప్రజలు వివిధ రకాలుగా చర్చించుకుంటున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా నాగజ్యోతి, జిల్లా అధ్యక్షుడిగా లక్ష్మణ్ బాబు ఉండగా, బీఎస్పీ నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న భూక్య జంపన్న సైతం ఉన్నారు. అయితే ఎవరికి వారే విడివిడిగా కార్యక్రమాల్లో పాల్గొనడంపై కార్యకర్తల్లో అసంతృప్తి ఏర్పడుతుంది. దీని ప్రభావం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చూపుతుందని పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతుంది.