యాదాద్రి భువనగిరి: భువనగిరి పట్టణంలో వినాయక నిమజ్జనానికి అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పట్టణంలోని ఆయా కాలనీలలో ఏర్పాటుచేసిన వినాయకులను నిమజ్జనాల కార్యక్రమం ప్రారంభమైంది. భువనగిరి లోని పెద్ద చెరువు వద్ద ఇప్పటికే పోలీస్, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహాల నిమజ్జనాల కోసం ప్రత్యేకంగా భువనగిరి పెద్ద చెరువు వద్ద రెండు భారీ గుంతలను ఏర్పాటు చేశారు. గణనాథుల నిమజ్జనాల కోసం భువనగిరి చెరువులో ప్రత్యేకంగా 5 పెద్ద క్రేన్లను ఏర్పాటు చేయనున్నారు.