నల్లగొండ జిల్లా పీఏ పల్లి మండలం అజ్మపురం పుష్కర ఘాట్ వద్ద నిమజ్జనం ఏర్పాట్లను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని భక్తులకు అందుబాటులో అన్ని సౌకర్యాలు ఉండేటట్లుగా చూడాలని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ సూచించారు. జిల్లా ఎస్పీ వెంట దేవరకొండ ఏఎస్పి మౌనిక ,దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి,పీఏ పల్లి ఎంపీడీవో చంద్రమౌళి తహసిల్దార్ జయశ్రీ ,గుడిపల్లి ఎస్సై నరసింహులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.