సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో వినాయక నిమజ్జన ఏర్పాట్లను అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పరిశీలించారు. మండలంలోని కొత్తూరు నారింజ ప్రాజెక్టు వద్ద ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ సుభాష్ రావు తో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిమజ్జనం సందర్భంగా ప్రాజెక్టు వద్ద సరిపడా సిబ్బందిని నియమించి పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. జహీరాబాద్ నుండి కొత్తూరు నారింజ వరకు వినాయక విగ్రహాల ఊరేగింపు వెళ్లే రూట్ మ్యాప్ పరిశీలించి రహదారిపై గుంతలు లేకుండా మరమ్మతులు చేపట్టాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.