పల్నాడు జిల్లా, నాదెండ్ల మండలం, గొరిజవోలు గ్రామానికి చెందిన గంజం బాజీ అనే నిందితుడు గుంటూరు నగరంలోని నల్లపాడు, నగరంపాలెం, పెదకాకాని, పాత గుంటూరు అరండల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్నట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం నగరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో గల కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడారు పార్కింగ్ చేసి ఉన్న కార్లను లక్ష్యం చేసుకుని కారు అద్దాలు పగలగొట్టి నిందితుడు చోరీలకు పాల్పడుతున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు.