అంతుచిక్కని వ్యాధితో పూసపాటిరేగ మండలంలోని కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. గడిచిన కొద్ది రోజులుగా వేలాది కోళ్లు మృతి చెందాయి. దీంతో పౌల్ట్రీ రైతులకు తీవ్రంగా నష్టం వాటిళ్లుతోంది. గోవిందపురం పరిసర ప్రాంతాల్లో ఒక్క రోజే వందలాది కోళ్లు మృత్యువాత పడగా వాటిని రైతులు ప్రత్యేకంగా గొయ్యి తీసి పూడ్చారు. అధికారులు స్పందించి వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.