రైతులు వరి, పత్తి వంటి సాంప్రదాయ పంటలే కాకుండా పూల సాగుపై కూడా దృష్టి సారించాలని సూచించారు. పూల సాగుతో తక్కువ కాలంలో అధిక ఆదాయం పొందవచ్చని తెలిపారు.పండుగల సీజన్ కు అనుగుణంగా మొక్కలు నాటుకోవాలని, పూల సాగును ప్రోత్సాహించడానికి ఉద్యాన శాఖ ద్వారా సబ్సిడీ అందిస్తున్నట్లు తెలిపారు.గులాబీ, బంతి, చామంతి, మల్లె వంటి పూల సాగుకై ఎకరానికి రూ. 8000 రూ., లిల్లీ, గ్లాడియోలస్ వంటి దుంప జాతి పూల సాగుకై ఎకరానికి రూ. 40,000/- సబ్సిడీ అందిస్తున్నామని వివరించారు.మల్లన్నపేట గ్రామంలోని ఒక ఎకరంలో లిల్లీ సాగు చేస్తున్న రైతు సరసాని హన్మంతరెడ్డి నెలకు దాదాపు రూ.35000/- ఆదాయం పొందుతున్నారు.