ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా భీమిలి మూడో వార్డు పరిధిలో గవర్నమెంట్ హాస్పిటల్ రూట్ వైపు ఉన్న పాన్ షాప్ యజమాని సరిపిల్ల అప్పారావు గోడ కూలిపోయింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకపోవడంతో స్థానికులు కొద్దిగా ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలిసిన వెంటనే గొలగాని నరేంద్ర, ఇన్స్పెక్టర్ విజయ్, శానిటేషన్ వరప్రసాద్ స్పందించి జీవీఎంసీ క్రేన్ సహాయంతో సంఘటనా స్థలాన్ని శుభ్రం చేయించారు. ఈ కార్యక్రమంలో కనకాల అప్పలనాయుడు, నకిలీ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.