శ్రీ సత్య సాయి జిల్లా రొద్దం మండలంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గురువారం మధ్యాహ్నం ఏపీటీఎఫ్ రొద్దం మండల శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ క్యాంపెయిన్ జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సమస్యలను తెలుసుకున్నారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనంకి అశోక్ కుమార్, జిల్లా అధ్యక్షుడు కోడూరు శ్రీనివాసులు మాట్లాడుతూ, సంవత్సరం గడిచినా ఉపాధ్యాయుల ఆర్థిక, ఆర్థికేతర సమస్యలు పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. వెంటనే పిఆర్సి కమిషనర్ నియామకం చేసి, పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.