పుట్టపర్తి నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఎవరైనా ఉంటే సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవాలని మంగళవారం సాయంత్రం పార్టీ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే ఓ ప్రకటనలో తెలిపారు. వైద్యం జరిగిన 3 నెలలలోపు కావాల్సిన దరఖాస్తు పత్రాలు తీసుకొని పార్టీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు