హయత్ నగర్ డివిజన్లోని రామకృష్ణ నగర్ లో కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి అధికారులతో కలిసి గురువారం మధ్యాహ్నం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కాలనీలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులతో పాటు సిసి రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సిసి రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణ ఉండాలని అధికారులకు సూచించారు. అనంతరం స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఎటువంటి సమస్యలు ఉన్న పరిష్కరించాలని అధికారులకు సూచించారు.