అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్... భారత్ పై విధిస్తున్న ఎగుమతి సుంకాలకు, అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 6న నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వామపక్ష నేత టి.సూర్యనారాయణ తెలిపారు. గురువారం విజయనగరంలో ఆయన మాట్లాడుతూ... సుంకాలు విధించడం వల్ల వివిధ రకాల వృత్తులు చేసేవారు నష్టపోతారన్నారు. విద్యార్థుల వీసాలను కఠినతరం చేయడం, పరిమితులు విధించడం వల్ల చదువుల కోసం అమెరికా వెళ్లే విద్యార్థులు నష్ట పోతారన్నారు.