మంత్రి కొండా సురేఖకు తనకు ఎలాంటి విభేదాలు లేవని మంత్రి సీతక్క అన్నారు. తాము సమ్మక్క-సారమ్మ లాగా అక్కాచెల్లెళ్లగా కలిసే ఉన్నామన్నారు. రాజకీయాల్లో ఆడబిడ్డలను ఎదగనివ్వాలని, సమాజంలో ఆడబిడ్డలు ఎదుగుతుంటే ఓర్వలేక పోతున్నారన్నారని నేడు శుక్రవారం రోజున మధ్యాహ్నం 12 గంటలకు మండిపడ్డారు. సురేఖ తనకు సోదరి అని, తాము కలిసి తిరిగినా ఓర్వలేక పోతున్నారని ధ్వజమెత్తారు. ఆడబిడ్డలను తిరగనివ్వండి మీ ఇంట్లో వాళ్లాలాగా మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు.