గుంటూరు నగరంలో త్రాగునీటి సరఫరాపై ఇంజినీరింగ్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా కలుషిత నీటి సరఫరాపై ఫిర్యాదులు అందితే యుద్దప్రాతిపదికన స్పందించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. గురువారం మధ్యాహ్నం కమిషనర్ నగరంలోని రెడ్ల బజార్, పాత గుంటూరు, కుందుల రోడ్, జేకేసి కాలేజి రోడ్, శ్రీనివాసరావు తోట పలు ప్రాంతాల్లో పర్యటించి, త్రాగునీటి సరఫరాపై అందిన ఫిర్యాదులను, పారిశుధ్య పనులను, రోడ్ల ఆక్రమణలను, అభివృద్ధి పనులను పరిశీలించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.