సంగారెడ్డిలోని మహబూబ్ సాగర్ చెరువు కట్టపై ఈనెల 6న జరిగే వినాయక నిమజ్జనానికి మున్సిపల్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వినాయక నిమజ్జనం కోసం రెండు క్రేన్లను ఏర్పాటు చేశారు.చెరువు కట్ట ప్రారంభం నుంచి చివరి వరకు రెండువైపుల బారికేడ్లను బిగించారు. 50 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఐ రమేష్ తెలిపారు.