బీడీ కార్మికులకు చేయూత పథకం కింద కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెలా ఇస్తామన్న రూ. 4016 పింఛన్ హామీ అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సురేష్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చేపట్టారు. బీడీ పరిశ్రమపై లక్షలాదిమంది ఆధారపడి జీవిస్తున్నారని ఎన్నికల ముందు రేవంత్ ప్రభుత్వం హామీ ఇచ్చిన చేయూత పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పీఎఫ్ ఉన్నా బీడీ కార్మికులందరికీ పింఛన్ అమలు చేయాలని, రాజీనామా చేసిన కార్మికుల పింఛన్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.