వైసిపి ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందని అక్కసుతో కూటమి ప్రభుత్వం అభివృద్ధిని విడమర్చి వైద్య కళాశాల సైతం విస్మరించిందని ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రాజు ఆరోపించారు. అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు వైఎస్ఆర్సిపి క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే శనివారం ఉదయం 11 గంటల సమయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం లో నిర్మాణాలకు శ్రీకారం చుట్టిన వైద్య కళాశాల నిర్మాణాలను కూటమి ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు.