మండపేట లో 49వ రాష్ట్రస్థాయి టెన్నికాయిట్ చాంపియన్‌షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇండోర్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెన్నికాయిట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోటీలను ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అసోసియేషన్ సభ్యులతో కలిసి ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు