సూర్యాపేట జిల్లా: మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయని డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు సోమవారం అన్నారు. ఈ సందర్భంగా సోమవారం తుంగతుర్తి మండలం వెంపటి ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చిన్నతనం నుంచి క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు.