స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పెదగంట్యాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి పరిసరాల పరిశుభ్రత మరియు వర్షాకాలం వచ్చే వ్యాధులపై అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ రాలిని డి ఎం హెచ్ ఓ పి జగదీశ్వర్ రావు ప్రారంభించి అందరి చేత స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో వచ్చే వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని అలాగే దోమ లార్వా అభివృద్ధి చెందకుండా నీటి నిలువ లేకుండా చేయాలని, దోమల వల్ల ప్రభలు వెళ్లే డెంగ్యూ దోమకాటు జబ్బుల పై అవగాహన కలిగి ఉండాలని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచి వ్యక్తిగత శుభ్రత పాటించి కాచి చలార్చి నీటిని తాగాలని ఆయన అన్నారు.