ఫిట్ ఇండియా మిషన్ లో భాగంగా జాతీయ క్రీడా దినోత్సవమును జాతీయ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ నెల 29 నుండి 31 వరకు ప్రతీ పిల్లల సంరక్షణ కేంద్రాలలో వున్న బాలబాలికలు క్రీడాకార్యక్రమాలలో పాల్గొనేటట్టు చూడాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సరియా ఆదేశాలతో స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారిణి సువర్ణ ఆధ్వర్యంలో జిల్లా బాలల సంరక్షణ విభాగం ద్వారా బొమ్మరిల్లు బాలల సంరక్షణ కేంద్రం, ఒంగోలులో 12 సం లోపు పిల్లలకు మరియు 12 సం పైబడిన పిల్లలకు పలు క్రీడాకార్యక్రమాలు నిర్వహించారు.పరుగుపందెం, క్యారమ్స్, మ్యూజికల్ చైర్, తాడాట మొదలైన క్రీడలు నిర్వహించారు