ప్రజల సంక్షేమానికి ప్రజా పాలన ద్వారా కృషి చేయడం జరుగుతుందని పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు గడ్డం వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో గల గోదావరి నది తీరంలో వరద నీటి పరిస్థితి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా పాలన ద్వారా ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుందని అన్నారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు లోనికి 7 లక్షల నుండి 8 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరిందని తెలిపారు