సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని షేకాపూర్ గ్రామంలో హజ్రత్ షేక్ షాబుద్దీన్ దర్గా 675వ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి గ్రామం నుండి దర్గా వరకు గంధం ఊరేగింపు భక్తిశ్రద్ధలతో నిర్వహించి దర్గాలో సమర్పించారు. ఉత్సవాలకు సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు, స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావు, సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి లు హాజరై దర్గా లో దట్టీలు సమర్పించి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ఖవ్వాలి ప్రదర్శనను తిలకించారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. భక్తులు వివిధ ప్రాంతాల నుండి భారీగా తరలివచ్చారు.