దేశంలో ఇటీవల అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సురక్షా స్మృతి (BNSS) చట్టం ఆధారంగా గద్వాల్లో తొలి తీర్పు వెలువడింది. కేటిదొడ్డి మండలం ఉమ్మిత్యాలకు చెందిన ఈరన్న మద్యం మత్తులో వాహనం నడిపిన కేసులో గద్వాల్ మొదటి అదనపు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఉదయ్ నాయక్ జైలు శిక్షకు బదులుగా సమాజ సేవ చేయాలని తీర్పు వెలువరించారు. ప్రభుత్వాసుపత్రి వద్ద 'మద్యం వద్దు.. ఫ్యామిలీ ముద్దు' అంటూ ప్రజలకు అవగాహన కల్పించారు.