సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో 207 కేసులు పరిష్కారమైనట్లు మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ సీనియర్ సివిల్ జడ్జి కవితా దేవి తెలిపారు. శనివారం నిర్వహించిన లోక్ అదాలత్ లో సీనియర్ కోర్టు విభాగంలో 89 బ్యాంక్ పి ఎల్ సి , 14 సైబర్ క్రైమ్, 6 సివిల్ కేసులు జూనియర్ కోర్టు విభాగంలో 8 సివిల్ , 44 క్రిమినల్ కాంపౌండ్, 37 అడ్మిషన్, 9 ఎక్సైజ్ కేసులు పరిష్కారం కాగా 89, 72,630 రూపాయలు వసూలు అయినట్లు న్యాయమూర్తి తెలిపారు.