గణేష్ ఉత్సవ కమిటీ ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా బేతంచర్లలోని ఆయా కాలనీలలో నిర్వాహకులు మట్టి వినాయకులను బుధవారంవినాయక చవితి పండుగ సందర్భంగా కొలువుంచారు. ప్రధానంగా అమ్మవారి శాల వద్ద ఆర్యవైశ్యులు వాసవి గణేష్, గౌరీపేట భజన మందిరంలో నాగుల గౌరీ గణేష్, ప్రధాన రహదారి ప్రక్కన శివసేన గణేష్ నిర్వాహకులు మట్టి వినాయకులను ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుల ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.