ఉద్యోగం రాలేదన్న మనస్థాపనతో బొబ్బిలి మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన బలగా మధు బొబ్బిలి మండలం గణ తోట వలస ఎల్ సి గేట్ సమీపంలో గుర్తుతెలియని రైలు కింద పడి మృతి చెందినట్లు బొబ్బిలి రైల్వే పోలీసులు శనివారం మధ్యాహ్నం తెలిపారు. ఈ ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బొబ్బిలి రైల్వే హెడ్ కానిస్టేబుల్ బి ఈశ్వర రావు తెలియజేశారు.