కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పరిధిలోని పోరుమామిళ్ల మండలం పోరుమామిళ్ల రంపాడు రోడ్డులో ఉన్న బెల్లగుడి కాలువను గురువారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి సభ్యులు పోరుమామిళ్ల మండల అధ్యక్షులు అన్వర్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సూక్ష్మ నీటిపారుదల రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కడప జిల్లాలో 100 చెరువుల మరమ్మత్తుల కోసం 73 కోట్ల రూపాయలను నిధులను మంజూరు చేసినా, పోరుమామిళ్ల పెద్ద చెరువుకి ఎటువంటి ప్రయోజనం లేదన్నారు.