తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని శ్రీకాళహస్తి - ఎల్లకారు రైల్వే స్టేషన్ మధ్యలో రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుమారు 40 -50 సంవత్సరాల వయసు కలిగిన గుర్తు తెలియని మగ వ్యక్తిని రైలు ఢీ కొట్టినట్టు తెలుస్తుంది. అయితే మృతుని వద్ద ఇలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. మృతి చెందిన వ్యక్తి వైట్ కలర్ షర్ట్, వైట్ కలర్ పంచే ధరించి ఉన్నాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న జి ఆర్ పి ఓ పి హెడ్ కానిస్టేబుల్ కే శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం గూడూరు వైద్యశాలకు తరలించారు. కేసు