చిత్తూరు నగరంలోని కొంగారెడ్డిపల్లి జిల్లా కలెక్టర్ బంగ్లా వద్ద ఉన్న RSETI ఉపాధి శిక్షణ కేంద్రంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు నూతన మగ్గం ఉపాధి శిక్షణ కోర్సుకు సంబంధించిన బ్యాచ్ను ప్రారంభించినట్లు ఆ సంస్థ డైరెక్టర్ యు.వి ప్రేమ్ సాగర్ తెలిపారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఆయన మీడియాకు వెల్లడిస్తూ ఇప్పటివరకు టైలరింగ్ మగ్గంలో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్ల ప్రదానంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. ప్రస్తుతం 30 మందితో నూతన మగ్గం బ్యాచ్ ప్రారంభమైంది అన్నారు. సుమారు 14 విభాగాలలో గ్రామీణ పట్టణ ప్రాంతాల నిరుద్యోగ యువతీ యువకులకు గృహినీలకు ఉచిత ఉపాధి శిక్షణ ఇస్తామన్నారు