నగరి మండల పరిధిలో వినాయక చవితిని పురస్కరించుకొని వినాయక ప్రతిమలు ఏర్పాటు చేయదలచిన వారు తప్పనిసరిగా ముందస్తు అనుమతులు పొందాలని నగరి సీఐ విక్రమ్ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను తెలియజేశారు. ఎవరైతే వినాయక చవితి నిర్వహిస్తారో వారు ఆన్ లైన్ గణేశ్ ఉత్సవ్ యాప్లో తగు వివరాలు నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలన్నారు. వాటిని పరిశీలించిన తర్వాత అనుమతి ఇస్తామన్నారు. అందరూ సహకరించాలని కోరారు.